Oct 14,2019 07:44AM
హైదరాబాద్: ఫొటోలు, వీడియోలు, సందేశాలు పంపించుకోవడంతో పాటు కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్న వాట్సాప్, మరో 2 నెలల్లో చెల్లింపుల సేవల్లోకీ ప్రవేశించనుంది. డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనలను పాటించేందుకు 2 నెలలు పట్టొచ్చని, అనంతరం చెల్లింపుల సేవలను వాట్సాప్ ప్రారంభిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి దిలీప్ అస్బే వెల్లడించారు. 'వాట్సాప్ చెల్లింపుల సేవలు ప్రారంభించినా, వ్యవస్థలో నగదు చెలామణిపై ప్రభావం చూపేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుంది' అని వివరించారు. ఏడాది నుంచి వాట్సాప్ చెల్లింపుల సేవలను ప్రయోగాత్మకంగా కొందరు ఖాతాదార్లకు అమలుచేస్తున్న సంగతి విదితమే. అందరికీ సేవలు ఆరంభమైతే, 30 కోట్ల మంది వినియోగదారులకు సౌలభ్యం కలుగుతుంది.