Oct 14,2019 07:58AM
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి బయట వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. దసరా పండుగ సందర్భంగా నిన్న శ్రీవారిని 1,03,310 మంది దర్శించుకున్నారు. 41,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దసరా సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.