Oct 14,2019 09:09AM
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బిఎన్ కండ్రిగ మండలం, అరిగెల కండ్రిగ వద్ద కారు, ఆటో డీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.