Oct 16,2019 12:27PM
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలోకుపైగా బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద 653 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టుగా మార్చి ప్రత్యేకంగా కుట్టించిన జీన్స్‌లో దాచి ప్రయాణికుడు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడితోపాటు ఆ బంగారాన్ని తీసుకోవడానికి వచ్చిన వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బంగారం విలువ రూ.24 లక్షలకుపైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.