చెన్నై: తమిళనాడులో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంసీ సుప్రెమో జయలలిత మరణాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. 2016లో 75 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై చాలా అనుమానాలు లేవనెత్తాయి. స్పష్టమైన సమాధానం దొరకనప్పటికీ రోజులు గుడస్తున్నా కొద్ది జయలలిత మరణంపై చర్చ మెల్లిగా సమసిపోయింది. అయితే ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తారు స్టాలిన్.
జయలలిత మరణ రహస్యాన్ని తమ పార్టీయైన ద్రవిడ ముణ్నేట్ర కజగం బయటపెడుతుందని స్టాలిన్ అన్నారు. పళనిస్వామి ప్రభుత్వం పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిందని, జయలలిత మరణ రహస్యాన్ని వెల్లడించడం వల్ల చట్టబద్ధతపై విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. దక్షిణ తిరునెల్వేలి జిల్లాలోని విక్రవాండి విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు.
Oct 16,2019 08:49PM