న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 18 వతేదీ నుంచి డిసెంబరు 13వతేదీ వరకు జరగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేత్వత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై పార్లమెంటు సమావేశాలు నవంబరు 18వతేదీ నుంచి జరపాలని నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల కోసం ఏజెండాను త్వరలో జరగనున్న పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రూపొందించాలని నిర్ణయించారు. గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 11 ను ప్రారంభమై జనవరి 8వతేదీ వరకు నిర్వహించారు. దేశంలో ప్రస్థుతం నెలకొన్న ఆర్థికమాంద్యం, ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి పుట్టిస్తాయని భావిస్తున్నారు.
Oct 17,2019 06:43AM