Oct 17,2019 07:23AM
హైదరాబాద్: చందానగర్ సర్కిల్ పరిధిలో చలాన్ల పర్వం కొనసాగుతున్నది. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వారికి జీహెచ్ఎంసీ భారీ మొత్తంలో జరిమానాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడవ రోజైన బుధవారం సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్‌లో రూ.8.25 లక్షలు, మియాపూర్ డివిజన్‌లో రూ.3.45లక్షలు, హఫీజ్‌పేట్ డివిజన్‌లో రూ.1.05లక్షలు, చందానగర్ డివిజన్‌లో రూ.3.20 లక్షలు మొత్తం కలిపి రూ.15.95 లక్షలు వసూలు చేసినట్లు ఉపకమిషనర్ యాదగిరిరావు తెలిపారు. సర్కిల్ పరిశుభ్రతకు భంగం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.