Oct 17,2019 07:32AM
న్యూఢిల్లీ : ఓ కరడుకట్టిన దొంగపై పోలీసులు కాల్పులు జరిపి, గాయపర్చి అరెస్టు చేసిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన రాజ్ కుమార్ అనే చైన్ స్నాచర్ 18 దొంగతనాలు, స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. ఢిల్లీలోని పితాంపుర, పంజాబీ బాగ్, రాజౌరి గార్డెన్, మంగల్ పురి, దక్షిణ రోహిణీ ప్రాంతాల్లో రాజ్ కుమార్ పలు స్నాచింగులకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాజ్ కుమార్ కాలికి గాయమైంది. రాజ్ కుమార్ ను అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీకి చర్యలు తీసుకున్నారు. కరడుకట్టిన దొంగపై గతంలో పలు కేసులు నమోదైనాయి. నిందితుడిని రిమాండుకు తరలిస్తామని డీసీపీ సంజీవ్ యాదవ్ చెప్పారు.