Oct 18,2019 12:55PM
ఢిల్లీ: మెక్సికోలో భారత చొరబాటుదారులు 325 మంది ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం యూఎస్ నుండి భారతీయలు వీసా గడువు ముగినప్పటికీ మెక్సికోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మెక్సికో అధికారులు 325 మంది భారతీయలును వెనక్కి పంపారు. దీంతో వారు తిరిగి నేడు స్వదేశం చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో వారు భారత్ చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.