Oct 18,2019 01:48PM
ఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఢిల్లీ హై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జ్ షీట్ లో నిందితులుగా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, కార్తీ చిదంబరం, పీటర్ ముకర్జీయా పేర్లను నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే తీహార్ జైలులో చిదంబరం శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిని సీబీఐ నిన్న ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీన విచారించనున్నట్టు తెలిపింది.