Oct 18,2019 02:05PM
ఇస్లామాబాద్: ప్రస్తుత పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. టెస్టు, టీ20 ల నుండి కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగించింది. టెస్టు కెప్టెన్ గా అజర్ అలీని, టీ20లకు కెప్టెన్ గా బాబర్ ఆజంను నియమిస్తున్నట్టు తెలిపింది. వరల్డ్ కప్ లో పాక్ ప్రదర్శన ఘోరంగా ఉండటంతో సర్ఫరాజ్ ను కెప్టెన్ నుండి తొలగించాలని పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆరోపణలు చేసారు. దీంతో బోర్డు అతన్ని కెప్టెన్సీ నుండి తొలగించింది.