Oct 18,2019 03:44PM
భద్రాద్రి కొత్తగూడె: జిల్లాలోని బూర్గంపాడు మండల పరిధిలోని పినపాకపట్టి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.