Oct 18,2019 04:44PM
శ్రీకాకుళం : స్నానం కోసం వటిగెడ్డలో దిగి ప్రమాదవశాత్తూ కాలుజారిపడి వ్యక్తి గల్లంతైన ఘటన శుక్రవారం వీరఘట్టంలో చోటు చేసుకుంది. వీరఘట్టంలోని వట్టిగెడ్డలో స్నానానికి దిగి మండల కేంద్రానికి చెందిన గొదబ సంజీవ్ (62) ప్రమాదవశాత్తూ కాలుజారిపడి గల్లంతయ్యాడు. సంజీవ్ కు సంబంధించిన కుటుంబీకులు, గ్రామస్థులు వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.