Oct 18,2019 05:24PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస, నియంతృత్వ పోకడకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది దోపిడీ, అవినీతి కోణమని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదన్నారు. 700 కిలో క్యాలరీల ద్రవ హారాన్ని తీసుకుని కేసీఆర్ దొంగ దీక్ష చేశారని విమర్శించారు. ప్రపంచ నియంతలందరిలో కేసీఆర్ మొదటి స్థానం సంపాదించారన్నారు. ఆర్టీసీ నుంచి తీసుకునేది ఎక్కువ... ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చేది తక్కువని తెలిపారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చే మంచి సలహాలు ఎందుకు స్వీకరించరు?, ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని పొన్నాల కోరారు. ఆర్టీసీ అమరవీరులకు కాంగ్రెస్ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసింది.