Oct 18,2019 05:43PM
హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్టీ పోలవరపు తులసీదేవి భౌతికకాయం న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోంది. గతవారం న్యూయార్క్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్‌లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా తులసీదేవి సుదీర్ఘకాలం పనిచేశారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక ట్రస్టీగా తులసీదేవి ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాట్లలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. నిధుల సమీకరణ, అత్యాధునిక వైద్య పరికరాల సమీకరణలో ఆమె కీలక పాత్ర పోషించారు. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు బసవతారకం ఆస్పత్రిలో తులసీదేవి భౌతికకాయం ఉంచుతారు. తులసీదేవి స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలోని కంఠంరాజు కొండూరు గ్రామం.