Oct 18,2019 06:14PM
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ గెలవడమే టీం ఇండియా ముందున్న లక్ష్యమని టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సంవత్సరం సమయం ఉందన్న కోహ్లీ.. ఈ 12నెలల కాలాన్ని లక్ష్యసాధనకు ఉపయోగించుకుంటామన్నాడు. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ ట్రోపీలో సెమీఫైనల్ వరకు వెళ్లి వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైనట్లు గుర్తుచేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ట్రోపీలో మొదటి నుంచి జైత్రయాత్ర కొనసాగించిన భారత జట్టు.. సెమీఫైనల్లో వెనుదిరిగిందన్నాడు. గత ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2020లో టీ20 ప్రపంచకప్‌ను సాధించేందుకు భారతజట్టు కృషి చేస్తుందన్నారు.