Oct 18,2019 11:50PM
న్యూడిల్లీ: 'గ్రామీణ భారత్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అధికార బీజెపీ ఏం చేయలేకపోతుంది. ఏం చేయాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉంది. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు, ఆలోచనలు, పలు విధానాలు రూపొందింది మా మేనిఫెస్టోలో ప్రచురించాం. తాజా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మా ఆలోచనలు దొంగిలించాలి' అని రాహుల్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్నారు.