Oct 19,2019 01:35PM
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడే వరకూ ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి వీలు లేదని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ అన్నారు. కాశ్మీర్ లోయలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, పరిస్థితులు మెరుగుపడే వరకూ ఏ రకమైన పద్ధతుల్లోనూ ప్రదర్శనలు చేపట్టరాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడటం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన చెప్పారు. కొంతమంది మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. అటువంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.