Oct 19,2019 02:25PM
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్(పీవో) తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2 వేల పోస్టుల పీవో పోస్టుల భర్తీ నిమిత్తం నిర్వహించిన పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల రోల్ నెంబర్లను వెబ్‌సైట్‌లో పొందిపరిచినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు మూడు సంవత్సరాలు పనిచేసే కాలపరిమితితో పాటు రూ. 2 లక్షల బాండును సమర్పించాల్సి ఉంటుంది.