Oct 19,2019 02:55PM
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్‌సీసీ గేటు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు. ఎన్‌సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంపాల రాజేశ్ రాజేశ్ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్‌ఎస్) సభ్యులు ఆర్ట్స్ కాలేజీ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఓయూ ఉద్యోగుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి.