హైదరాబాద్ : అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'అలవైకుంఠపురంలో' చిత్రంలోని సామజవరగమనా.. పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. యూట్యూబ్ లో ఆ పాట సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు 41 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట సొంతం చేసుకుంది. ఇదే సమయంలో 7 లక్షల లైక్స్ ను కూడా యూట్యూబ్ లో దక్కించుకుంది. అత్యధిక యూట్యూబ్ లైక్స్ ను దక్కించుకున్న తెలుగు పాటగా సామజవరగమనా నిలిచింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ యూట్యూబ్ సెన్షేషన్ గా నిలిచాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొదటి పాట సెన్షేషనల్ సక్సెస్ అవ్వడంతో రెండవ పాటను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. బన్నీకి యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ తో ఆ పాట కూడా రికార్డులను దక్కించుకోవడం ఖాయం అంటు ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Oct 19,2019 03:50PM