Oct 19,2019 08:42PM
హైదరాబాద్ : పల్నాడు వైసీపీ బాధిత టీడీపీ కార్యకర్తలతో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు ధైర్యం, సహనంతో ఉండాలని టీడీపీ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని అన్నారు. ఈ సమావేశంలో నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, మద్దాలి గిరి తదితరులు పాల్గొని వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం తప్ప అభివృద్ధి కనిపించడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందని విమర్శించారు. ఉడుత ఊపులకు చింతకాయలు రాలవు, వైసీపీ బెదిరింపులకు టీడీపీ భయపడదు అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.