Oct 20,2019 06:50AM
ముంబై: సంక్షోభంలో ఉన్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు దక్షిణ ముంబైలోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆర్‌బీఐ, పీఎంసీ బ్యాంక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.
పీఎంసీ బ్యాంకులో రూ.4,355 కోట్ల అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. దీనిలో ఉన్న డిపాజిటర్లు తమ ఖాతాల నుంచి రూ.1000 మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేకుండా నిబంధన విధించింది. ఆ తర్వాత నిబంధనలను సడలిస్తూ విత్‌డ్రా పరిధిని రూ.40,000కు పెంచింది. ప్రస్తుతం తమ డబ్బు మొత్తం వాపస్ ఇచ్చేయాలని డిపాజిటర్లు ఆందోళనకు దిగారు.