Oct 20,2019 07:20AM
న్యూఢిల్లీ: 2022లో జరుగనున్న 91వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. చిలీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ సమావేశాల్లో సభ్య దేశాలన్నీ ఇందుకు మద్దతు తెలిపినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతినిధి నితిన్ వకాంకర్ తెలిపారు. 91వ ఇంటర్‌పోల్ సమావేశాల్ని భారత్‌లో నిర్వహించాలని గత ఆగస్టులో భారత్ పర్యటనకు వచ్చిన ఇంటర్‌పోల్ ప్రధాన కార్యదర్శి జ్యుర్జెన్ స్టాక్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారన్నారు. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న 88వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారత్ తరుఫున పాల్గొన్న సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు మెజారిటీ ఓట్లు లభించినట్టు వకాంకర్ తెలిపారు.