Oct 20,2019 07:49AM
హైదరాబాద్: విద్యుత్‌శాఖలో 3,025 జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం www.studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలన్నారు. కోచింగ్, ఇతర వివరాలకు 04024071178 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.