Oct 20,2019 07:55AM
ఖమ్మం: పినపాక మండలంలోని దుగినేపల్లి గ్రామ శివారులో మావోయిస్టు సానుభూతిపరుడిని శుక్రవారం రాత్రి ఏడూళ్లబయ్యారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఠాణాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సురేశ్ వివరాలు వెల్లడించారు. పినపాక మండలం వలస ఆదివాసీ గ్రామం పిట్టతోగుకు చెందిన మడకం ఎర్రయ్య గత కొంతకాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో దుగినేపల్లి గ్రామ శివారులో మావోయిస్టు పోస్టర్లు వేసేందుకు వస్తున్నాడని గుర్తించి నిఘా వేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం రిమాండుకు తరలించినట్లు ఎస్సై వివరించారు.