Oct 20,2019 03:59PM
హైదరాబాద్ : నగరంపై వరుణుడు మరోసారి ప్రభావం చూపించాడు. ఈసారి పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్, ఉప్పుగూడ, ఫలక్ నుమా, గౌలిపుర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు జీడిమెట్ల, సూరారం, నాగోల్, బండ్లగూడ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.