Oct 21,2019 07:37AM
శంషాబాద్: శంషాబాద్(ఉందానగర్) రైల్వేస్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శవం గుర్తు పట్టకుండా ముక్కలుకావడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.