Oct 21,2019 10:44AM
పూణే: మహారాష్ట్రలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పూణే లోని శివాజీనగర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో పవర్ కట్ అయింది. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న అధికారులు క్యాండిళ్ల సాయంతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహించే అధికారులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ కట్ తో పోలింగ్ కు ఇబ్బంది కలుగుతోందని అన్నారు.