Oct 21,2019 11:03PM
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని చెబుతోంది. దీంతో మహానగర గతుకుల రోడ్లు బాగవుతాయని ఆశిస్తోంది. తొలుత వర్క్ ఏజెన్సీలకు పనులు అప్పగిస్తామని సంకేతాలు ఇచ్చింది.
మహానగర ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చినుకు పడితే చాలు చిత్తడయిపోతాయి. దీంతో నగరవాసి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీనిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వర్క్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో నగర రహదారుల రూపురేఖలు మారతాయని ప్రభుత్వం భావిస్తోంది.