Oct 22,2019 07:41AM
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉన్న నికోబార్ దీవుల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా ఉన్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొన్నది. ఇవాళ ఉదయం 6.36 నిమిషాలకు భూమి కంపించినట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడులో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచన కారణంగా.. ఇవాళ రామనాథపురంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.