Oct 22,2019 11:30AM
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండో రోజు దేశరాజధాని ఢిల్లిసలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సమావేశమైన జగన్ రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రహ్లాద్ జోషితో సీఎం జగన్ సమావేశం కానున్నారు.