Oct 22,2019 11:32AM
హైదరాబాద్: షైన్ ఆసుపత్రి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి యజమాని సునీల్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సాయంత్రం ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. షైన్ ఆసుపత్రి ఘటనపై అధికారులు స్పందించారు. ఆసుపత్రుల్లో భద్రతపై ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టనున్నాయి. నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో జీహెచ్‌ఎంసీ, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ తనిఖీలు నిర్వహించనుంది.