Oct 22,2019 11:34AM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం రామాయంపేట లో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యర్రంనీడి నాగబాబు అనే వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజులుగా మృత్యువు తో పోరాడి ఈ రోజు ఉదయం 5.30 కి తుదిశ్వాస విడిచాడు.