రాంచి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సఫారీసేనను టీమ్‌ఇండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌తో టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్‌శర్మ ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్''ను అందుకున్నాడు. సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు యాజమాన్యం సపోర్ట్‌తోనే అద్భుత ప్రదర్శన కొనసాగించానని రోహిత్ పేర్కొన్నాడు. ''ఈ సిరీస్‌లో కొత్తబంతిని సమర్థంగా ఎదుర్కొన్నాను. ప్రపంచంలో ఎక్కడైనా కొత్తబంతి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందే. టెస్టుల్లో ఓపెనర్‌గా నాకు శుభారంభం దక్కింది. 2013లో వైట్‌బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా దిగినప్పుడు క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాలని తెలుసుకున్నాను. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే విజృభించవచ్చు. ఈ తరహాలోనే నేను బ్యాటింగ్ చేశాను. జట్టు యాజమాన్యం, కోచ్, కెప్టెన్ మద్దతు ఎంతో దోహదపడింది. భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తా'' అని తెలిపాడు. దక్షిణాఫ్రికా సిరీసులో ''హిట్‌మ్యాన్'' నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 132.25 సగటుతో 529 పరుగులు బాదాడు. దీనిలో ద్విశతకం, రెండు శతకాలు ఉన్నాయి.
Oct 22,2019 01:11PM