Oct 22,2019 03:29PM
ఢిల్లీ: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకులో రుణాల ఎగవేతదారులైన రాకేశ్ వాదావన్, సారంగ్ వాదావన్‌ల కస్టడీని పొడగిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీకి వరకు వారిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంచేలా ఆదేశించింది. ఈరోజు ఉదయం పీఎంసీ బ్యాంకు డైరెక్టర్ సుర్జీత్ సింగ్ అరోరా పోలీసు కస్టడీని పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.