Oct 22,2019 04:12PM
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పినందుకు ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. న్యూఢిల్లోని ఓ బైకరి షాపులో ఈ నెల 15న ఈ దారుణం జరిగింది. బేకరిలో పనిచేస్తున్న ఖలీల్ అహ్మద్‌ను ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగ్ కావాలని అడిగాడు. అయితే ఈ బ్యాగ్‌లపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఇవ్వటం కుదరదని ఖలీల్ తేల్చిచెప్పాడు. కానీ ఫైజాన్ మాత్రం తాను పట్టిన పట్టు వీడలేదు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఫైజాన్ ఓ ఇటుక రాయితో ఖలీల్‌ను నెత్తిపై బలంగా మోదాడు. ఆ ధాటికి ఖలీల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఖలీల్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా..ఘటన తరువాత ఫైజాన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.