Oct 22,2019 06:04PM
విశాఖ: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతానికి అనుకోని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా దానికి అనుబంధంగా 5.8 కిమీ ఎత్తులో ఆవర్తనం కూడా కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరంవైపు పయనించనుందని దీనిప్రభావంతో రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీరంవెంబడి దీనిప్రభావంతో యాభై కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.