Oct 22,2019 07:30PM
హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడటం సహజమే. పిడుగులు పడ్డ ప్రాంతమంతా కాలిపోయి ఉంటుంది. ఆ మెరుపు క్షణాల్లోనే మాయమైపోతోంది. కానీ ఓ చెట్టు వద్ద పిడుగు పడడంతో ఆ చెట్టు కాండం చీల్చుకుపోయి మంటలు అంటుకున్నాయి. ఆ చెట్టు కాండంలో కాసేపు మంటలు మండాయి. ఈ ఘటన టెక్సాస్‌లోని ట్రినిటీలో అక్టోబర్ 17వ తేదీన చోటు చేసుకుంది. అయితే ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. చెట్టులో మంటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.