Oct 23,2019 09:54AM
విజయనగరం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసింది. డివిజన్, మండల కేంద్రాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా నేడు జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.