Oct 23,2019 09:56AM
హైదరాబాద్: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. శ్రీధ ఆసుపత్రి దగ్గర బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తాజ్‌మహల్ కాలనీకి చెందిన మధు(35) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.