Oct 23,2019 01:40PM
హైదరాబాద్: విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై.. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సహా జిల్లాలోని అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశారు. అధికారులంతా ఆయా మండల, డివిజన్ కేంద్రాల్లో ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో 08922 236947 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.