హైదరాబాద్: హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లారు సైదిరెడ్డి. లోకల్ లీడర్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగాౌ ఎస్సై రాంఘవేందర్ రెడ్డి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డిౌ ఓవర్ యాక్షన్ వద్దు.. ఏం హీరో అనుకుంటున్నావా.. అంటూ ఎస్సైకే వార్నింగ్ ఇచ్చారు. అయితే సైదిరెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్ధి అనే ధీమాతో విధుల నిర్వర్తిస్తున్న పోలీసులపై దౌర్జన్యం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైదిరెడ్డిపై హుజూర్ నగర్ పీఎస్ లో పలువురు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాఘవేందర్ రెడ్డి విధులకు అడ్డంకి కలిగించాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సైదిరెడ్డి పై 356,504 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
Oct 23,2019 01:50PM