Oct 23,2019 11:44PM
ముంబయి: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' సినిమాలో మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందారు నటుడు షాహిద్ కపూర్. తాజాగా ఆయన హిందీలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 'పద్మావత్' పాత్రకు ఐష్ సరిపోతారని చెప్పారు. 'ఒకవేళ పద్మావత్ చిత్రాన్ని మీరు కాకుండా వేరే నటీనటులతో తీయాల్సి వస్తే ఆ పాత్రలకు ఎవరు సరిపోతారని అనుకుంటున్నారు' అని షాహిద్‌ను ప్రశ్నించారు. దీనిపై షాహిద్ మాట్లాడుతూ..'హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రంలో నటించిన అజయ్ దేవగణ్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్‌ఖాన్ 'పద్మావత్' సినిమాలోని పాత్రలకు సరిపోతారు అని తెలిపారు.