హైదరాబాద్ : పోలీసులను, పారా సైనిక దళాలను ఉపయోగించి జెఎన్‌యులో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై దారుణమైన దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించిందని ఆర్.ఏల్. మూర్తి రాష్ట్ర అధ్యక్షులు, టి.నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకువచ్చిన క్రూరమైన హాస్టల్ ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా జెఎన్‌యు విద్యార్థులు రెండు వారాల నుండి పోరాడుతున్నారు. ఈమధ్య ఎన్నికైన జెఎన్‌యు విధ్యార్ధి సంఘంకు ఏ విధమైన ప్రజాస్వామ్య చర్చలకు కూడా కనీసం వైస్ ఛాన్సలర్( విసి) మరియు అడ్మినిస్ట్రేషన్ అనమతి ఇవ్వడానికి సిద్ధంగా లేదని. విద్యార్థి వ్యతిరేక హాస్టల్ మాన్యువల్(అధిక ఫీజులు) వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థి సంఘాంతో కలసి చర్చించాలని విసిని కోరుతూ ఈ రోజు నిరసనకారులు విసి సమావేశ వేదిక దగ్గరకు వెళ్లారు. విద్యార్థులతో కలసి సమస్యలను చర్చించకుండా, వారితో మమేకమయ్యే బదులు, క్రూరమైన బలప్రయోగాని,పోలీసులను ఉపయోగించి వారిని అణచివేయడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించింది. ఈ పోలీసులు దాడులో,వాటర్ క్యానన్స్,లాఠీచార్జి వల్లన చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. యూనివర్సిటీ విధ్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెఎన్‌యులో ప్రస్తుత ఉద్యమం విద్య యొక్క వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా పెద్ద పోరాటంలో భాగం. గత కోన్ని సంవత్సరాలలో, జెఎన్‌యును నయా ఉదారవాద సంస్కరణల కోసం ఒక ప్రయోగాల ప్రయోగశాలగా మార్చడానికి మరియు విద్యను మార్కెట్లో ఒక ఉత్పత్తి కంటే తక్కువ చేయడానికి బిజెపి మద్దతు ఉన్న జెఎన్‌యు విసి అడ్మినిస్ట్రేషన్ చురుకైన ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగమే ఈ అధిక ఫిజులు పెంపు నిర్ణయం అని అన్నారు.. ఈ దిశగా వారు తీసుకున్న అత్యంత తిరోగమన చర్యలలో ఇది ఒకటి. జెఎన్‌యు అడ్మినిస్ట్రేషన్ అమలు చేయడానికి ఆసక్తిగా ఉన్న కొత్త హాస్టల్ మాన్యువల్ హాస్టల్ ఫీజును అనేక రెట్లు అనగా 2700 ఉన్న ఫీజు 31,000 ఫీజు అవుతోంది అని అన్నారు. ఈటీతో పాటు విద్యార్థులపై నిఘూ పెట్టడం, కర్ఫ్యూలు పెట్టడం చేస్తున్నారు.
జెఎన్‌యు ప్రభుత్వ విద్యకు ఒక నమూనాగా ఉంది, ఇక్కడ తక్కువ ఫీజు, మరియు హాస్టళ్లలో సబ్సిడీతో కూడిన ఆహారం కారణంగా వెనుకబడిన నేపథ్యాల విద్యార్థులు ఉన్నత విద్యను పొందగలరు. ఎన్డీఏ ప్రభుత్వ రాజకీయ ఎజెండాను మోసే కేవలం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిపాలన, ఈ నిర్మాణాన్ని తారుమారు చేయడానికి వివిధ ప్రాజెక్టులను ప్రారంభించింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం అటువంటి దానిలో భాగమే ఇప్పుడు హాస్టల్‌ను ఆర్థికంగా వెనుకబడిన విభాగాల విద్యార్థులు అందుబాటులో లేకుండా వారు ఉండలేని ప్రదేశంగా మార్చడం, మినహాయింపు నమూనాను మరింత తీవ్రతరం చేస్తుంది. కొత్త సవరణలపై విద్యార్థులందరూ, వారు ఉండాలని ఏంచుకున్న హాస్టళ్ల రిప్రంజేటీవ్ లు మరియు అధ్యాపకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థి సంఘంతో చర్చలు చేయడానికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు సిద్ధంగా లేదు. అలా చేయకుండా, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలను నిరంతరం విడుదల చేయడంతో వారు నిరసనకారులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏస్.ఏఫ్.ఐ.తెలిపింది.
జెఎన్‌యులో నిరసన తెలిపిన విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ సెల్యూట్ చేస్తుందన్నారు. హాస్టల్ మాన్యువల్‌కు చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులను,విధ్యార్ధి సంఘాని చర్చలకు పిలవాలని ఏస్.ఏఫ్ కోరుతుంది.
Nov 11,2019 06:14PM