Nov 11,2019 08:10PM
హైదరాబాద్: 'విజయ్ సేతుపతి' సినిమా కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాశానని దర్శకుడు విజయ్ చందర్ తెలిపారు. ఆయన జనసేన పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండటంతో ఆ కథను తమిళ్‌లో విజయ్ సేతుపతితో తీశానని పేర్కొన్నారు. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన సినిమా ఇది. తమిళంలో ''సంగ తమిళన్'' పేరుతో రూపొందించారు. తెలుగులో ''విజయ్ సేతుపతి'' పేరుతో నవంబరు 15న విడుదల కానుంది. హర్షితా మూవీస్ పతాకంపై రావూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకను నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు సముద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ''విజయ్ సేతుపతి'' ట్రైలర్ విడుదల చేశారు.