Nov 11,2019 08:54PM
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వీకరించారు. ఆయన వరంగల్ రూరల్ జిలా పరిషత్ చైర్మన్ క్యాంపు ఆఫీసులో మూడు మొక్కలు నాటారు. అనంతరం మూడు మొక్కలు నాటాలని వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాటి హరిత, రాజ్యసభ ఎంపీ బాండ ప్రకాష్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పీవీ ఘాట్ లో మూడు మొక్కలు నాటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ కు ఛాలెంజ్ విసిరారు. ఆయన జలగం వెంగళరావు పార్కులో మూడు మొక్కలు నాటారు. ఆయన నటుడు విజయ్ దేవరకొండకు, జిహెచ్ఎంసి కమిషనర్ మర్రి యాదవ రెడ్డికి సవాల్ విసిరారు.