Nov 11,2019 08:59PM
ముంబై : ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన గడువు కోరగా గవర్నర్ తిరస్కరించారు. తాను ఇచ్చిన గడువులోగానే ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతి తెలియచేయాలని గవర్నర్ షరతు విధించారు. గవర్నర్ చెప్పిన ప్రకారం ఆయన వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన ఆదిత్య థాకరే ప్రభుత్వ ఏర్పాటుకు కొంత గడువు కావాలని కోరారు. కానీ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ ఏర్పడింది.