న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి క్యాష్‌బ్యాక్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, ఉచిత యాక్సెసరీలు.. వంటి మరెన్నో ఆఫర్లను ప్రకటించింది. వివో వి, ఎస్, వై సిరీస్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్‌కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని, అలాగే, జీరో డౌన్ పేమెంట్‌తో నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉందని తెలిపింది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వినియోగదారులకు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్లతోపాటు బ్లూటూత్ ఇయర్ ప్లగ్స్, ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ వంటివి ఉచితంగా అందించనున్నట్టు వివో తెలిపింది. ఎంపిక చేసిన డివైజ్‌లపై బై బ్యాక్ కూడా ఇవ్వనున్నట్టు పేర్కొంది. వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా వివో జడ్1 ఎక్స్ 4జీబీ ర్యామ్ం128 జీబీ వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్టు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ధర రూ.15,990 మాత్రమే.
Nov 11,2019 09:29PM