Nov 12,2019 10:37AM
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. నేడు ప్రభుత్వ ఏర్పాటు కోసం మహారాష్ట్ర గవర్నర్ ఎన్సీపీని కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఎన్సీనీ కాంగ్రెస్ పార్టీ, శివసేనతో మంతనాలు జరుపుతోంది. దీనిలో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్ రౌత్ ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిసారు. ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై వారిద్దరూ చర్చ జరుపుతున్నట్టు సమాచారం.